నా తెలంగాణ! కోటి రతనాల వీణ!!

Tuesday, December 12, 2006

????.....

స్వేచ్ఛా విహంగం
Sunday, December 10, 2006


హైదరాబాద్ లో IIT ????

ఇది బాసర నుంచి హైదరాబాద్ కి మార్చటానికి ప్రయత్నాలు చేస్త్తున్నారేంటి ?

కారణం ప్రొఫెసర్ల పిల్లలకు మంచి స్కూళ్ళు హైదరాబాద్ లో వుంటాయంట. వాళ్ళు ఎల్లకాలం చదువుతునే వుంటారా స్కూళ్ళ లో.దీనికీ ప్రత్యేక

తెలంగాణా కు, ప్రత్యేక హైదరాబాద్ కు ఎదో లింకు వున్నట్లు కనిపించట్లా !
వ్రాసినవారు పారుపల్లి
8:21 PM

7 Comments:

నేను మాత్రం మొదతినుండీ హైదరాబాదులోనే ఐ ఐ టీ వస్తే బాగు అనుకుంటున్నాను.

అమనము ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలంటేనే దగ్గరలో స్కూళ్ళు ఉన్నాయో లేవో చూస్తామే, అలాంటిది ప్రొఫెసర్లు చూడరా? ఐ ఐటీ కి ముందు కావలసినది ప్రొఫెసర్లే కదా.


ఇంకా హైదరాబాదులో ఇప్పుడు ఉన్న కంపెనీలు ఐఐటీ వస్తే చాలా లాభపడతాయి, అలాగే ఐఐటీ కూడా కంపెనీలను చక్కగా ఉపయోగించుకోని లాభపడుతుంది.

ఐఐటీ గౌహతీ, ఐఐటీ బొంబాయి వీటిలో రెంటిలో సీటు వస్తే నీవు ఎక్కడ చేరతావు?

ఐఐటీ హైదరాబాదు, ఐఐటీ బాసర వీటి రెంటిలో సీటు వస్తే నీవు ఎక్కడ చేరతావు?

కాకపోతే అలసు ఐఐటీయే తెలుగుప్రాంతానికి రాదు అనేకంటే కనీసం బాసర, సరస్వతీ ఆలయం అనే సెంటిమెంటు ఉపయోగిస్తే అయినా వచ్చిద్దేమో అని అనుకున్నాను (అసలే ఆ రోజుల్లో బీజేపీ దే రాజ్యమాయ!)

ఇప్పుడు హైదరాబాదుకు వస్తే మరీ మంచిది కదా

కావాలంటే బాసరలో మరో వేద విద్యాలయం కట్టుకోవచ్చు
అభిప్రాయము
kiran kumar Chava వ్రాసినవారు 3:20 AM

This post has been removed by the author.
అభిప్రాయము
keshavachary వ్రాసినవారు 4:00 AM

తెలంగాణా లో కట్టాల్సిన డ్యాములు,తెలంగాణా కు రావాల్సిన ప్రాజెక్టులు, అభివృద్ధి నిధులు యింకా ఎన్నో యిలాంటి కుంటి సాకుల తోనే దూరం చేసారు....
యివన్నీ పచ్చి అబద్ధాలు....

మెల్లి, మెల్లిగా ప్రతిష్టాత్మక సంస్థలను తెలంగాణా నుంచి తరలించే ప్రయత్నమే యిది...

ఏమైనా అంటే హైదరాబాదు తెలంగాణా కాదా అంటారు.మళ్ళీ అదే నోటితో హైదరాబాదు ఒక్క తెలంగాణా సొత్తు కాదంటారు....విడిపోతే,గిడిపోతే కేద్రపాలిత ప్రాంతం కావాలంటారు....
పచ్చి అవకాశవాదులు....

తెలంగాణా విద్యాభివృద్ధి కోసం ఏర్పడిన హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణా విద్యార్థులు ఎంతమంది వున్నారు?.....

రవాణా,కమ్యూనికేషన్ రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్న/చెందిన ఈ కాలంలొ ప్రొఫెసర్లు తమ బిడ్డలను చదివించడానికి హైదరాబాదు కావాలంటున్నారనే వాదన నిజంగా హాస్యాస్పదం....

ముంబాయిలో IIT వున్నంతమాత్రాన IIT గౌహతిలో ఎవరూ చేరట్లేదా?

ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థలన్నీ మెత్రోపాలిటన్ సిటీల్లోనే వున్నాయా?

నిజంగానే అంత నగర ప్రీతి వున్న ప్రొఫెసర్లు అలా అన్నారనుకున్నా దేశం మేధావులు లేక గొడ్డుపోయిందా?

ఎవరూ రాకున్నా బాసర IIT లొ మా తెలంగాణా విద్యార్థులే చేరతారు...మా తెలంగాణా మేధావులే మాకు గురువులవుతారు....
అభిప్రాయము
keshavachary వ్రాసినవారు 4:12 AM

ఇది భారతీయ సంస్థ. IIT రావటం తెలుగు వారికి గర్వ కారణం. ఇది తెలుగు వారి సొత్తు.

సకుంచిత ప్రాంతీయ భావాలకు ఇక్కడ చోటు లేదు.
అభిప్రాయము
పారుపల్లి వ్రాసినవారు 4:24 AM

కేశ్వాచారి గారూ
నా ఉద్దేశ్యము తెలంగాణానా హైదరాబాదా అని కాదండీ
హైదరాబాదు తెలంగాణా సొత్తు అని నూటికి నూరుపాళ్ళు విశ్వసించేవాడిని
అదే సమయంలో కలసి ఉండలేమా అని ఆలోచించేవాడిని

నేను కేవలం హైదరాబాదులో ఐఐటీ రావాలి అని అన్నాను కానీ తెలంగాణాకి రాకుడదు అనలేదు కదా!

గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకోవడంలా అన్నిటినీ తెలంగాణా ధృష్టిలో చూస్తే ఎలాగండీ,

ఐఐటీ గౌహతీలో చేరడంలేదు అని నేను అనలేదు రెంటిలో సీటు వస్తే మీరు ఎక్కడ చేరతారు అని మాత్రమే అడిగినాను
అభిప్రాయము
kiran kumar Chava వ్రాసినవారు 5:23 AM

తెలంగాణాని తెలంగాణావారిని అందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.తెలంగాణావారు మాత్రం ఏదో inferiority complex మనసులో పెట్టుకుని ఎవరినీ ప్రేమించలేకపోతున్నారు.దీన్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు.జై తెలంగాణా అంటే దావూద్ ఇబ్రహీమ్‌ని కూడా భుజాలకెత్తుకోవడానికి సిద్ధమౌతున్నారు.పక్షి కొమ్మపై వాలితే అది తెలంగాణా పక్షేనా అని ఆలోచిస్తున్నారు. ప్రతిదీ కోస్తావారితో పోల్చుకుని బాధపడుతున్నారు.ఓ prejudice బలంగా నాటుకుపోయిన వారిని ఏం చేసి మార్చగలం ?ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణావారు మారతారా ?అప్పుడైనా తోటి తెలుగువారిని ప్రేమించగలుగుతారా ? God knows.


నాకయితే IIT బాసరలోనూ ఇష్టం లేదు.హైదరాబాదులోనూ ఇష్టం లేదు. కరీంనగర్‌లో పెడితే చాలా సంతోషిస్తాను.హైదరాబాదులో ఇప్పటికే ఉన్నవి చాలు. ఎప్పుడూ హైదరాబాదో అని మొత్తుకోవడం మానేసి జిల్లాల సంగతి కూడా కాస్త ఆలోచించమని ఆంధ్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం.ఆ ప్రొఫెసర్లకి విమానాశ్రయం కావాలంటే కరీంనగర్‌లో కడదాం.వాళ్ళ పిల్లలకి చదువులు కావాలంటే ఓ కేంద్రీయ విద్యాలయం పెట్టిద్దాం.

కేశవాచారి గారికి-ఆర్యా ! IITలు స్థానిక సంస్థలు కావు.అక్కడ తెలంగాణా వారికి ఏ ప్రాంతీయ రిజర్వేషనూ ఉండదు, సీట్లలో గాని, ఉద్యోగాల్లో గాని.
అభిప్రాయము
బాలసుబ్రహ్మణ్యం వ్రాసినవారు 6:03 AM

కేశవాచారి గారూ,
తెలంగాణా విద్యాభివృద్ధి కోసం ఏర్పడిన హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణా విద్యార్థులు ఎంతమంది వున్నారు?.....
నేను ఈ విద్యాలయము విద్యార్ధినే.
మీరనుకుంటున్నాట్టు తెలంగాణ అభివృద్ధి ధ్యేయముతో దీన్ని స్థాపించలేదు. కావలంటే చరిత్ర తరచి చూడండి.

అయినా కేంద్రీయ విశ్వవిద్యాలయములో స్కెడ్యూల్డ్ కులాలు, తరగతులు, వికలాంగులకు తప్పించి తెలంగానేతరులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నట్టు లేవే?బాసరలో ఐ.ఐ.టీ అన్నది పిచ్చి సెంటిమెంటు మాత్రమే. అప్పుడు మాత్రము అందులో మహారాష్ట్రులు చేరరని గ్యారెంటీ ఏంటి? దాని బదులు తెలంగాణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (TIT) పెడితే పోలా. అందులో ఎంచక్కా అందులో 100% తెలంగాణా రిజర్వేషను పెట్టొచ్చు.
అభిప్రాయము
రవి వైజాసత్య వ్రాసినవారు 9:45 AM

( పారుపల్లి గారి "స్వేచ్ఛా విహంగం "లో 'హైదరాబాద్ లో IIT ????' అన్న అంశానికి నేను తెలిపిన అభిప్రాయం పై వచ్చిన విమర్శలకు సమాధానం.) ముందుగా మీ సామూహిక స్పందనకు/ఖండనకు నా అభినందనలు.

అయ్యా పారుపల్లిగారూ!

""సకుంచిత ప్రాంతీయ భావాలకు ఇక్కడ చోటు లేదు.""అనడంలోనే మీ విస్తృత అలోచనా లేమితనాన్ని(సంకుచితత్వాన్ని) కనబర్చారని మేమనుకోవటంలో తప్పేముందొ మీరు చెబితే నేను మళ్ళీ సమాధానమిస్తా.

పాపం మీరు ఈ వాదన/వేదన ప్రాంతీయ సంకుచిత భావన అని ఏ మాత్రం ఆలోచించకుండా ఒక సంకుచిత భావనలొ గిరిగీసుకుని వున్నట్టున్నారు అని మా లాంటి వారంటారండి....దానికి మీరేమంటారు?....

అందుకే అలా ఒక్క మాటలొ యిలా అన్నారు..... "సకుంచిత ప్రాంతీయ భావాలకు ఇక్కడ చోటు లేదు."

పత్రికల్లో వార్త వచ్చిందే తడవుగా ఆ విషయాన్ని తెలుగు లోకానికి తెలిపే బాధ్యతను నెత్తినేసుకుని,అంతటితొ వదిలేయక అందులో ఎవరికీ తెలియని బ్రహ్మాండం బద్దలయ్యే రహస్యాన్ని కనుక్కొని--

""ఇది బాసర నుంచి హైదరాబాద్ కి మార్చటానికి ప్రయత్నాలు చేస్త్తున్నారేంటి ?

కారణం ప్రొఫెసర్ల పిల్లలకు మంచి స్కూళ్ళు హైదరాబాద్ లో వుంటాయంట. వాళ్ళు ఎల్లకాలం చదువుతునే వుంటారా స్కూళ్ళ లో.

దీనికీ ప్రత్యేక తెలంగాణా కు, ప్రత్యేక హైదరాబాద్ కు ఎదో లింకు వున్నట్లు కనిపించట్లా !""అని అంటూ--

మా మీదకు వదిలేసిన మీ కంటే--కామెంట్ చేసినవాళ్ళే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకు కనీసం వివరణ యిచ్చుకున్నారు కదండీ....

కొంపదీసి యిలాంటి అనవసరపు/అర్హత నోచుకోని విషయాలపై నా బ్లాగులో మాట్లాడను అంటారా ఏమిటి???

నేను రాసిన మాటలేంటి, మీరు తెలిపిన అభిప్రాయమేమిటి అంటారా??

అయినా మీరన్న దానికంటే కాసింత ఎక్కువే వాగానేమో....అది నా పొరపాటే(యిప్పుడు కూడా).

ఒకవేళ చర్చ పక్కదారి తప్పిందనిపించినా అదెలాగో చెప్పి మళ్ళీ రహదారిలొ పెట్టాల్సింది మీరే కదా!!!

యింతకి మీకొచ్చిన ఆ ధర్మసందేహమూ, మీకు తెలిసి మాకు తెలియని(కనిపించని) ఆ దేవ రహస్యమూ ఏంటో కాస్త తర్వాతి పోస్టులో తెలుపుతారు కదూ!!

""తెలంగాణా కు, ప్రత్యేక హైదరాబాద్ కు ఎదో లింకు వున్నట్లు కనిపించట్లా !""అని అన్నారు కదా!

మీకు తెలిసి మాకు తెలియని(కనిపించని) ఆ విషయమేంటోఅంతుచిక్కకుండా వుంది.అందువల్ల నాలాగే చాలా మంది మీ మాటల్ని అపార్థం చేసుకొనే సదవకాశమూ వుంది.

మరీ ఘాటుగా రాయకండే....

పొడి పొడి మాటల్లో చెప్పి యిలాంటి చిక్కులే పెట్టకండే.... చర్చ కాస్తా ప్రయోజనాన్ని కోల్పోతుంది....

పాపం నాపై--అంటే నాలాంటి వాళ్ళపై(యింకా చెప్పాలంటే ఐఐటీల్లొ ప్రాంతీయ రిజర్వేషన్లు వుంటాయని అనుకుంటున్న అజ్ఞానులు.... అని వాళ్ళనుకుంటున్న వాళ్ళపై)... విమర్శలు--వాడిగా -వేడిగా,వేదనతొ, జాలితో,జ్ఞానంతో,సరైన సమాచారంతో చేసినవాళ్ళకి సమాధానం కావాలంటే "నా తెలంగాణా" కు రండి..

ఎందుకంటే యిక్కడ సంకుచిత ప్రాంతీయ భావాలకు చోటు లేదు..

ప్చ్.........అది మన దురదృష్టం

రవి వైజాసత్య గారూ!


మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు. మీరూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అవడం ఆనందంగా వుంది.


అయితే అన్నయ్యా !

నేను చరిత్ర తిరగేసే ముందు మీరే ఒకసారి యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ తిరగేయండి. అప్పుడు మీకు ఈ యూనివర్సిటి ఏ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిందో, ఆవిర్భావానికి మూలమైన చట్టమేంటో తెలుస్తుంది.

తర్వాత కూడా మీరు చెప్పేదానికే మళ్ళీ నిలబడితే అప్పుడు చూస్తా చరిత్ర.....

కానీ మీరు బాసర ఐ.ఐ.టి కి పెడదామన్న పేరు బావుంది. అలాగే పెడదాం. కానీ ఆ పేరు పెట్టినా వేరే ప్రాంత విద్యార్థులు చేరరని నమ్మకం ఏంటి గురువు గారూ?....


అయినా నేను తెలంగాణా విద్యార్థులకు రిజర్వేషన్లు అడగలేదే!ఈ ప్రాతంలోని అన్ని విద్యా ఉద్యోగ సంస్థల్లో స్థానికులకు తప్ప వేరే వారికి చోటు కూడదని ఎవరూ అనలేదండి.అంత చాదస్తులు ఎవరూ లేరిక్కడ....

మీరు భ్రమించిన విధంగానే చేస్తే ఎదురయ్యే పరిస్థితులను అలోచించుకుంటే జాలేస్తుంది....

మరిచి పోవద్దు ...నాకు చెప్పే ముందు మీరే ఒక్క సారి తిరగేయండి ...చరిత్రలొద్దు సుమా!ప్రాస్పెక్టస్ మాత్రమే....యింకా కాస్త ఆలోచించండి, తెలుసుకోండి.

ఆ తర్వాత స్టేట్మెంట్ యిద్దురు గాని....




అయ్యా బాల సుబ్రహ్మణ్యం గారూ!


మీరు చెప్పే వరకు తెలంగాణా పరిస్థితి ఇంత ధారుణంగా వుందన్న సంగతి నాకూ తెలియదండీ.నిజం...ఒట్టు.--("తెలంగాణాని తెలంగాణావారిని అందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.తెలంగాణావారు మాత్రం ఏదో inferiority complex మనసులో పెట్టుకుని ఎవరినీ ప్రేమించలేకపోతున్నారు")


అలా అయితే వెంటనే తెలంగాణా వారందరినీ సైకాలజిస్టుల వద్దకు పంపాలి.(మీ లెక్క ప్రకారం)
నిజంగా యింత అనుమానంగా ఆలోచిస్తున్నారా. అయితే ముందు తిరుగుతున్న మనుషులు కనబడట్లేదు కాబోలు. పక్షుల గురించే ఆలోచిస్తున్నారు.ఏదేమైనా మీరు వాడిన ఉపమానం బావుందండి.-("పక్షి కొమ్మపై వాలితే అది తెలంగాణా పక్షేనా అని ఆలోచిస్తున్నారు")

మీరు మాత్రం తెలంగాణా వారిని ప్రేమిస్తునే వుండండే!ఖచ్చితంగా మీ శ్రమ ఫలిస్తుంది....

god knows every thing....

(నొచ్చుకుంటే క్షమించండి...నా మాటలకు కాదు సుమా!) .








4 comments:

రవి వైజాసత్య said...

మీది మంథని యా?. నేను చాలా రోజుల క్రితం మంథని పై తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ప్రారంభించా చూడండి.

వడ్లూరి కేశవా చారి said...

ముందుగా మీ సామూహిక స్పందనకు/ఖండనకు నా అభినందనలు.

అయ్యా పారుపల్లిగారూ!

""సకుంచిత ప్రాంతీయ భావాలకు ఇక్కడ చోటు లేదు.""అనడంలోనే మీ విస్తృత అలోచనా లేమితనాన్ని(సంకుచితత్వాన్ని) కనబర్చారని మేమనుకోవటంలో తప్పేముందొ మీరు చెబితే నేను మళ్ళీ సమాధానమిస్తా.

పాపం మీరు ఈ వాదన/వేదన ప్రాంతీయ సంకుచిత భావన అని ఏ మాత్రం ఆలోచించకుండా ఒక సంకుచిత భావనలొ గిరిగీసుకుని వున్నట్టున్నారు అని మా లాంటి వారంటారండి....
దానికి మీరేమంటారు?....

అందుకే అలా ఒక్క మాటలొ యిలా అన్నారు.....

పత్రికల్లో వార్త వచ్చిందే తడవుగా ఆ విషయాన్ని తెలుగు లోకానికి తెలిపే బాధ్యతను నెత్తినేసుకుని,అంతటితొ వదిలేయక అందులో ఎవరికీ తెలియని బ్రహ్మాడం బద్దలయ్యే రహస్యాన్ని కనుక్కొని
""ఇది బాసర నుంచి హైదరాబాద్ కి మార్చటానికి ప్రయత్నాలు చేస్త్తున్నారేంటి ?

కారణం ప్రొఫెసర్ల పిల్లలకు మంచి స్కూళ్ళు హైదరాబాద్ లో వుంటాయంట. వాళ్ళు ఎల్లకాలం చదువుతునే వుంటారా స్కూళ్ళ లో.దీనికీ ప్రత్యేక

తెలంగాణా కు, ప్రత్యేక హైదరాబాద్ కు ఎదో లింకు వున్నట్లు కనిపించట్లా !""
అని అంటూ మా మీదకు వదిలేసిన మీ కంటే--కామెంట్ చేసినవాళ్ళే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకు కనీసం వివరణ యిచ్చుకున్నారు కదండీ....

కొంపదీసి యిలాంటి అనవసరపు/అర్హత నోచుకోని విషయాలపై నా బ్లాగులో మాట్లాడను అంటారా ఏమిటి???

నేను రాసిన మాటలేంటి, మీరు తెలిపిన అభిప్రాయమేమిటి అంటారా??

అయినా మీరన్న దానికంటే కాసింత ఎక్కువే వాగానేమో....
అది నా పొరపాటే(యిప్పుడు కూడా).

ఒకవేళ చర్చ పక్కదారి తప్పిందనిపించినా అదెలాగో చెప్పి మళ్ళీ రహదారిలొ పెట్టాల్సింది మీరే కదా!!!

యింతకి మీకొచ్చిన ఆ ధర్మసందేహమూ, మీకు తెలిసి మాకు తెలియని(కనిపించని) ఆ దేవ రహస్యమూ ఏంటో కాస్త తర్వాతి పోస్టులో తెలుపుతారు కదూ!!

""తెలంగాణా కు, ప్రత్యేక హైదరాబాద్ కు ఎదో లింకు వున్నట్లు కనిపించట్లా !""అని అన్నారు కదా!

ేమీకు తెలిసి మాకు తెలియని(కనిపించని) ఆ విషయమేంటో
అంతుచిక్కకుండా వుంది.
అందువల్ల నాలాగే చాలా మంది మీ మాటల్ని అపార్థం చేసుకొనే సదవకాశమూ వుంది.

మరీ ఘాటుగా రాయకండే....
పొడి పొడి మాటల్లో చెప్పి యిలాంటి చిక్కులే పెట్టకండే....
చర్చ కాస్తా ప్రయోజనాన్ని కోల్పోతుంది....

పాపం నాపై--అంటే నాలంటి వాళ్ళపై(యింకా చెప్పాలంటే ఐఐటీల్లొ ప్రాంతీయ రిజర్వేషన్లు వుంటాయని అనుకుంటున్న అజ్ఞానులు.... అని వాళ్ళనుకుంటున్న వాళ్ళపై)... విమర్శలు--వాడిగా వేడిగా,వేదనతొ, జాలితో,జ్ఞానంతో,సరైన సమాచారంతో చేసినవాళ్ళకి సమాధానం కావాలంటే నా తెలంగాణాకు రండి..

ఎందుకంటే యిక్కడ సంకుచిత ప్రాంతీయ భావాలకు చోటు లేదు..

ప్చ్.........అది మన దురదృష్టం

(నొచ్చుకుంటే క్షమించండి...నా మాటలకు కాదు సుమా!)

Shailu said...

How are you? Shailendra Singh here. Recently, I was googling for natelangana and found a very good blog of yours. I am from Karnataka and Telugu being somewhat same with Kannada in writing. And my little understanding of Telugu, I read some points of articles from your blog. Hmm, coming to the point. I host a blog at my Dreamhost Account called www.natelangana.com. Since the blog is yet not submitted to Google. On searching natelangana in Google, we end up with your blogspot blog. If I submit our Natelangana Website to Google then the case will be different(Fully Reversed). Now, this natelangana site which is owned by an NRI was made not for participating in Telangana agitation. But, to give information about the region. I see you are even blogging since 2006. And this Telangana Agitation is much more old than may be, before I was born. Now, I offer you www.natelangana.com domain. And, I will negotiate between you and that NRI. In other words, I would like to sell you www.natelangana.com Domain. So, you can blog in a fresh way. Do much more than we use to do. Also, I would personally set-up your new blog, on purchase from us. You can host freely on our Hosting account. Only think is we cannot give control of Hosting Account. You can even target Telugu Audience grow traffic, earn form Google Adsense. As Google has opened office at Hyderabad to target regional Ads. If you are interested then contact at www.netizensstop.com or contact at admin@netizensstop.com

Unknown said...

exclent information blogger
https://goo.gl/Ag4XhH
plz watch our channel